ఓటుకు నోటు వ్యవహారంపై అద్వానీ ఎదురుదాడి
posted on Sep 8, 2011 2:40PM
న్యూఢిల్లీ: ఓటుకు నో
టు కుంభకోణానికి సంబంధించి ఈరోజు లోక్ సభలో బీజేపీ ఎదురుదాడికి దిగింది. నిన్న అరెస్టు చేసిన బీజేపీ మాజీ ఎంపీలను బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ కొనియాడారు. వాళ్ళది తప్పైతే తననూ అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఆయన అన్నారు. 'ఆనాటి మా ఎంపీలిద్దరూ రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రవర్తించారు. అప్పుడు అద్వానీ ఎన్డీయేకు వర్కింగ్ చైర్మన్ గా ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరిరోజైన ఈరోజు ఓటుకు నోటు వ్యవహారాన్ని లేవనెత్తిన అద్వానీ ఆరోజు ప్రభుత్వం ఓట్లను కొనడానికి ప్రయత్నించిందన్నది నిర్వివాదాంశమన్నారు. తమ ఎంపీలు నిజాయతీగా విషయం సభకు తెలియజేశారని, డబ్బు తెచ్చి ఇచ్చారని, ప్రతిపక్షనేతగా ఉన్న తనకు వాస్తవాలు తెలుసనీ అద్వానీ చెప్పారు. నిజాయతీగా ప్రవర్తించినందుకు వారిని జైలుకు పంపారని అద్వానీ ఆరోపించారు. జీరో అవర్ లో అద్వానీ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడగా సభలో తనని అడ్డుకుంటే విషయాన్ని సభ బయట ప్రస్తావిస్తానని ఒక దశలో అద్వానీ హెచ్చరించారు. అయినా సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ మీరాకుమార్ సభను రెండోసారి వాయిదా వేశారు.