పెళ్లికి రెడీ అయిన నితిన్‌ హీరోయిన్‌.. సైలెంట్‌గా నిశ్చితార్థం!

పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. సినిమా రంగంలో ఉన్న కొందరు హీరోలు, హీరోయిన్లు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరక్‌ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్‌ పెళ్లికి సిద్ధమైంది. విష్ణుతో ఆగస్ట్‌ 22న నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 

చెన్నయ్‌కి చెందిన మేఘా ఆకాష్‌ ‘లై’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నితిన్‌ హీరో. ఆ తర్వాతి సినిమా ‘ఛల్‌ మోహనరంగ’ చిత్రంలో కూడా నితిన్‌కి జంటగా నటించింది మేఘా. తెలుగు, తమిళ్‌, హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె కొన్ని మ్యూజిక్‌ వీడియోలు కూడా చేసింది. అయితే ఆమెకు హీరోయిన్‌గా సరైన గుర్తింపు రాలేదు. కొంతకాలంగా మేఘా పెళ్లి ఒక రాజకీయ నాయకుడి కుమారుడితో జరగనుందని వార్తలు వచ్చాయి. ఇవి ప్రచారంలో ఉండగానే సైలెంట్‌గా విష్ణుతో ఆమె నిశ్చితార్థం జరిగింది. పెళ్ళి ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు మాత్రం ఎనౌన్స్‌ చెయ్యలేదు. అయితే మేఘాను వివాహం చేసుకోబోతున్న విష్ణు ఎవరు అనేది తెలియరాలేదు. ఏది ఏమైనా వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న విష్ణు, మేఘాలకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు.