నిశిత్ నారాయణ నివేదికపై బెంజ్ ప్రతినిధుల రివర్స్ గేర్...
posted on Jun 27, 2017 12:57PM

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన తరువాత కారుపై కూడా ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన బెంజ్ కంపెనీ ప్రతినిధులు.. ఆదిశగా దర్యాప్తు చేపట్టింది. అయితే ఇప్పుడు బెంజ్ కంపెనీ ప్రతినిధుల వితండ వాదనపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నివేదిక పంపించాల్సిందిగా పోలీసులు వారిని కోరగా... దీనికి స్పందించిన బెంజ్ ప్రతినిధులు... నిశిత్ నారాయణ పోస్టుమార్టం నివేదికలతో పాటు అక్కడి సీసీ పుటేజీలు, పిల్లర్ వద్ద నుంచి కారును తొలగించినప్పుడు ఏమైనా వీడియో తీశారా? తదితర వివరాలు ఇస్తేనే తాము నివేదిక ఇస్తామంటూ వెల్లడించారు. కాగా నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు బెంజ్ కంపెనీకి లేఖ రాస్తూ సీటు బెల్టు పెట్టుకుంటేనే బెలూన్లు ఓపెన్ అవుతాయా, పెట్టుకోకున్నా ఓపెన్ అవుతాయా అన్న వివరాలతో పాటు ఎంత స్పీడ్‌లో వెళ్తే మృతి చెందే అవకాశాలున్నాయో చెప్పాలంటూ కోరగా గత నెల 16వ తేదీన బెంజ్ ప్రతినిధులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు.