ట్రయల్ రూమే కాదు..ట్రైన్ బాత్‌రూంలోనూ వదలరు


 

ఇల్లు, ఆఫీస్, రోడ్డు ప్లేస్ ఏదైనా సరే ఆడవారికి రక్షణ ఉండటం లేదు. మహిళలను తినేసేలా చూడటమే కాదు..ఆమెను నగ్నంగా చూడాలని కొందరు మృగాళ్లు తహతహలాడుతుంటారు. ట్రయల్ రూమ్స్, స్నానాల గదులు, లాడ్జింగ్‌ల్లో సీసీ కెమెరాలు, టూవే మిర్రర్స్ పేరిట దొంగచాటుగా ఆడవారిని చిత్రీకరించిన ఎన్నో ఘటనలు మనం చూశాం. ఆఖరికి వందలాది మంది ప్రయాణించే రైల్లలోనూ కొందరు కీచకులు కెమెరాలతో వెంటాడుతున్నారు. ముంబైలో జరిగిన ఈ సంఘటన రైళ్లలో పరిస్థితికి అద్దం పడుతోంది. థానే నగరానికి చెందిన ఓ మహిళ లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ ఎ-1 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రాత్రి మూత్ర విసర్జన కోసం బాత్రూమ్‌కు వెళ్లింది. ఇది గమనించిన సలీం అనే రైల్వే ఉద్యోగి..బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి రహస్యంగా వీడియో తీశాడు. అయితే ఇంతలో అతని సెల్‌‌ఫోన్‌లో అలారం మోగడంతో ఆమెకు పరిస్థితి అర్థమైంది..తననెవరో రహస్యంగా చిత్రీకరిస్తున్నారన్న విషయాన్ని కనిపెట్టింది. వెంటనే బయటకు వచ్చి తోటి ప్రయాణికులకు చెప్పడంతో అంతా కలిసి సలీం వద్ద తనిఖీ చేయగా..అతని మొబైల్లో పలువురి మహిళల అర్థనగ్న వీడియోలు కనిపించాయి. దీంతో అతన్ని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంతో రైళ్లలో మహిళల భద్రతపై రైల్వేశాఖ మరింత దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu