తెలంగాణ తేజం నిఖిత్ జరీన్ కు స్వర్ణ పతకం

కామన్ వెల్త్ గేమ్స్ లో తెలంగాణ తేజం నిఖిత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో ఆమె ఐర్లండ్ కు చెందిన కార్లీ మెక్ నౌల్ పై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కామన్ వెల్త్ గేమ్స్ లోబాక్సింగ్ లో భారత్ కు ఇది మూడో స్వర్ణం కాగా బాక్సింగ్ ఈ వెంట్లో భారత్ కు ఇప్పటి వరకూ మొత్తం ఆరు మెడల్స్ వచ్చాయి.

ఆదివారం రోజే నీతూ ఘంఘాస్, అమిత్ పంగల్ స్వర్ణ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.  మొత్తంగా ఈ కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు17 పసిడి పతకాలు.  12 సిల్వర్, 19 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. మొత్తంగా 48 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

 ఇక జరీన్ నిఖిత్ విషయానికి వస్తే ఆమెకు  ఈ సీజన్‌లో ఇది నిఖత్ సాధించిన మూడో గోల్డ్ మెడల్.మేరీ కోమ్ తర్వాత బాక్సింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తున్న క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ నిలిచింది.  నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలిపారు.