ఢిల్లీ మారణహోమం పై సోనియా ఆందోళన

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ నుంచి ఈ ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చిన సోనియా బాంబు పేలుడు బాధితులకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ఎదుట బుధవారం జరిగిన బాంబు పేలుడులో మృతి చెందిన వారికి ఆమె సంతాపం ప్రకటించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ సోనియా ధన్యవాదాలు తెలిపారని ద్వివేది వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu