కొత్త ఏడాదిలో అయినా ఇవి అలవాటు చేసుకోండి.. జీవితం సంతోషంగా ఉంటుంది!
posted on Dec 28, 2023 8:21AM
డిసెంబర్ నెల ముగింపుకు వచ్చేస్తోంది. కొత్త అనే పదంలోనే ఒకానొక ఆశాభావం ఉంటుంది. చాలామంది పుట్టినరోజు సందర్బంగానో, పండుగల సందర్భంగానో, కొత్త ఏడాది సందర్బంగానో ఈ సారి అయినా నా జీవితం మెరుగ్గా ఉండాలి, నేను ఇంకా బాగా ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే కొత్త ఏడాదిలో ఈ కింద చెప్పుకునే అలవాట్లు జీవితంలో భాగం చేసుకుంటే జీవితం సంతోషమయమవుతుంది. అవేంటో తెలుసుకుంటే..
కృతజ్ఞత..
కృతజ్ఞత అనేది చాలా గొప్ప విషయం. జీవితంలో సానుకూల అంశాల అంశాలను గుర్తుచేసుకుని ఆయా సందర్బాలకు కృతజ్ఞత చెప్పుకోవడం, సానుకూల జీవతానికి సహకరిస్తున్నవారికి కృతజ్ఞతన చెప్పడం, ప్రపంచంలో ఎంతో మందితో పోలిస్తే తమకు మెరుగైన జీవతమే లభించిందని తృప్తిగా ఉండటం, జివితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల మనిషిలో సంతృప్తి పెరుగుతుంది.
సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి..
స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆప్తులతో అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన సంబంధాలు జీవితంలో గొప్ప సంతోషానికి కారణమవుతాయి. కష్ట సుఖాలను పంచుకోవడం, విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం మొదలైన సందర్బాలకు ఆత్మీయ సంబంధాల తోడు ఎంతో అవసరం.
మీకోసం మీరు..
ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు, బంధువులు ఇలా అందరూ ఉండి ఉండవచ్చు. అందరితో సంతోషమూ లభించవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత సమయం ఉండాలి. చదవడం, నడవడం, అభిరుచి కలిగిన పనులు చేయడం. ఆనందాన్ని ఇచ్చే పనులు చేయడం ద్వారా మానసికంగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ సమయం ఆత్మ విమర్శ చేసుకోవడానికి, తమను తాము తరచి చూసుకోవడానికి కూడా సహాయపడుతుంది.
చురుగ్గా ఉండాలి..
ప్రస్తుతకాలంలో వేగంగా వ్యాపిస్తున్న వ్యాధులు, అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని నిశ్చలమైన జీవనశైలి వదిలిపెట్టాలి. శారరక శ్రమ, మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ధ్యానం, యోగా వంటిని ఫాలో కావాలి.
ఆరోగ్యకమైన ఆహారపు అలవాట్లు..
నేటికాలం ప్రజల ఆహారపు అలవాట్లు చాలా దారుణంగా తయారయ్యాయి. పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్నని తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి.
సెలబ్రేషన్..
చిన్న విజయం అయినా సరే అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది తదుపరి పనులను మరింత ఉత్సాహంతో చేసేలా ప్రేరేపిస్తుంది.
పాజిటివ్ గా ఉండాలి..
పాజిటివ్ గా ఉంటే ఎలాంటి సమస్యలు అయినా అధిగమించవచ్చు. అవి వ్యక్తిగతం అయినా, వృత్తి సంబంధ విషయాలు అయినా సానుకూలతతో ముందుకు వెళితే ఫలితాలు కూడా సానుకూలంగానే ఉంటాయి.
*నిశ్శబ్ద.