యూకే వీసా కొత్త మార్పులు..భారత్ ఉద్యోగులపై ప్రభావం
posted on Nov 24, 2016 10:11AM
యూకే వీసా విధానంలో కొత్త మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మార్పులు నేటి నుండి అమల్లోకి రానున్నాయి. తమ దేశంలోకి వస్తున్న విదేశీ ఉద్యోగులను నిలువరించడానికే యూకే ఈ విధమైన మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం
*నవంబర్ 24 తరువాత టైర్-2 ఇంటర్నల్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ) కోసం దరఖాస్తు చేసుకుంటే 30 వేల పౌండ్లు కట్టాలి. గతంలో ఇది 20,800 పౌండ్లు ఉండేది.
* విదేశాల నుంచి తీసుకువచ్చే ఉద్యోగుల్లో టైర్ 2 సాధారణ ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని, శిక్షణ నిమిత్తం వచ్చే గ్రాడ్యుయేట్ ట్రయినీలైతే వేతనం రూ. 19.14 లక్షలుగా ఉండాలని నిర్ణయించారు.
* ఇక ఒక్కో కంపెనీ సంవత్సరానికి 20 మందిని మాత్రమే తీసుకురావాలన్న నిబంధన కూడా నేటి నుంచి యకేలో అమల్లోకి రానుంది.
అయితే ఈ మార్పుల వల్ల అందరి సంగతేమో కానీ.. భారత్ నుంచి వెళ్లే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులపైనే అధిక ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.