స్టెల్త్ వేరియంట్ ప్రమాదకరమా?...
posted on Mar 30, 2022 9:30AM
ఈ అంశం పై పూర్తిగా చర్చించే ముందు స్టేల్ ఒమైక్రాన్ అంటే ఏమిటో మీకు తెలుసా ?స్టేల్ వేరియంట్ లక్షణాలు ఏమిటి ? స్టేల్ వేరియంట్ ప్రభావం తీవ్రత వల్లే చైనాలో లాక్ డౌన్ పెట్టారా?కోరోనా ఒమైక్రాన్ సంక్రమించి ఇంకా పెరుగు తూనే ఉన్నాయి. చైనా లోని అతి పెద్ద నగరం లో లాక్ డౌన్ విధించారన్న వార్త ప్రపంచదేశాలలో చక్కర్లు కొడుతోంది.పెద్ద సంఖ్యలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. షాంగై లోని పుదీంగ్ జిల్లాలోని సరిహద్దులు ప్రాంతాలలో సుక్ర వారం వరకు మూసివేస్తునట్లు ప్రకటించా రని వార్త సంస్థల భోగట్ట.కోవిడ్19 పట్ల చైనా అనుసరిస్తున్న ఖటిన నిబందనల లో భాగం గా చైనా సోమవారం నుండి చైనా లోని అతి పెద్ద నగరం షాంగాయ్ ని మూసి వేయడం ప్రారంభించింది. అలా వ్యవహరించడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నలు ప్రపంచాన్ని వేదిస్తున్నాయి. చైనా దేశమంతటా 56,౦౦౦ మంది కి సంక్రమించిందని అది క్రమేణా శరవేగం గా విస్థరిస్తోందన్న వార్తలు గుప్పు మంటూ ఉండడం తో చైనా అధికారికంగా చర్యలు చేపట్టిందని ఆక్కడి వార్తా సంస్థలు వెలువరించాయి.
అయితే షాంగాయ్ లో కేవలం 47 మందికి మాత్రమే సోకడం కొంతమేర ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఇది హర్షించా దగ్గ పరిణామం గా నిపుణులు పేర్కొన్నారు.కోవిడ్19 వచ్చిన రెండు స్సంవత్సరాల మధ్య కాలం లో అతి పెద్ద ఉపద్రవం గా పెరేకొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ ఇతర జిల్లాల లోని సమీప ప్రాంతాలు శుక్ర వారం మూసివేసారు.పట్టణ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.చైనా లో జరుగుతున్న పరిణామాల వెనుక స్టేల్ వేరియంట్ ఒమైక్రాన్ ప్రభావం ఉందని అంగీకరించక తప్పదు.కోరోనా వైరస్ కు ఓమైక్రాన్ వేరియంట్ ఒక సబ్ వేరియంట్ గా నిపుణులు పేర్కొన్నారు.
స్టెల్త్ ఒమైక్రాన్ అంటే ?...
చైనా నుండి వస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు స్టేల్ వేరియంట్ ఓమిక్రాన్ ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.స్టేల్ వేరియంట్ ఒమైక్రాన్ అంటే ఓమైక్రాన్ బి ఏ 2 క్రమం గా పెరగడం గమనించవచ్చు.ఒమైక్రాన్ బి ఏ 2 ఓమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ గా నిపుణులు గుర్తించారు. అయితే బి ఎ2 ఒమైక్రాన్ సబ్ వేరియంట్ ను తీసుకుని పూర్తిగా పరిశోదనలు చేయాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు.బి ఎ2 ఒమైక్రాన్ సబ్ వేరియంట్ మూల వేరియంట్ ఒమైక్రాన్ ను ప్రాధాన వేరియంట్ తో పోల్చి నప్పుడు. ఎక్కువగా సంక్రమిస్తోందని డేనిష్ పరిశోధకుల వివరాల ప్రకారం ఓమై క్రాన్ తో పోలిస్తే 1.5% రెట్లు పరివర్తన మ్యుటేట్ అవుతుందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.
డెల్టా కన్నా స్టెల్త్ వేరియంట్ ప్రమాద కరమా?...
డెల్టా వేరియంట్ కన్నా స్టెల్త్ వేరియంట్ ఓమైక్రాన్ ప్రమాదకరమా ? అత్యంత ప్రభావ వంత మైనదా ?అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.డెల్టా వేరియంట్ వైరస్ మాత్రమే ఇప్పటి వరకూ అత్యంత ప్రమాదకరమైనదిగా నిరూపిత మైనదని నిపుణులు పేర్కొన్నారు.డెల్టా వేరియంట్ శరీరం లోని ఊపిరి తిత్తుల పై ప్రభావం వల్ల తీవ్ర అనారోగ్యం ఇన్ఫెక్షన్ సోకి శ్వాస అందక మరణాలు చోటు చేసుకున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం డెల్టా వేరియంట్ కు భిన్నం గా ఓమై క్రాన్ దీని సబ్ వేరియంట్ ఊపిరి తిత్తులపై భాగం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణం గానే ఊపిరి తిత్తుల పై అత్యంత ప్రమాదకరమైన నిమోనియా ముక్కుకు వాసన తెలియక పోవడం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు చూడవచ్చు. స్టేల్ వేరియంట్ లక్షణాలు ఏమిటి? పైన పేర్కొన్న విధంగా ఒమైక్రాన్ లోని వేరియంట్లు ఊపిరి తిత్తుల పై భాగం పై ప్రభావం చూపుతుంది. దీనికి తోడు పొట్టలో సమస్యలు ఇలాంటి లక్షణాలు చూడవచ్చు .పొట్టలో నొప్పి, వాంతులు, తెమిలి నట్లుగా ఉండడం,గుండెల్లో మంట పొట్ట ఉబ్బరం, అతిసారం,నలత గా ఉండడం. నీరసంవంటి లక్షణాలు గమనించ వచ్చు.
స్టెల్త్ ఒమైక్రాన్ యొక్క ఇతర లక్షణాలు...
జ్వరం, త్వరగా అలిసిపోవడం, దగ్గు, గొంతులో గరగర, తల నొప్పి, కండరాల నొప్పులు, బలహీన పడడం, గుండె స్పందన, కొట్టుకోవడం,పెరగడం గమనించవచ్చు.ఇలాంటి లక్షణాలు గమనించిన వెంటనే తప్పనిసరిగా మీరు అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రాధాన ఒమైక్రాన్ వేరియంట్ కన్నా ఇది అత్యంత ప్రమాదకరమైనదా ?మొట్ట మొదట చేసిన పరిశోదన లో తేలిన విషయం ఏమిటి అంటే స్టెల్త్ ఒమైక్రాన్ కోరోనా వైరస్ కన్నా ఇతర వేరియంట్ల కన్నా అత్యంత ప్రమాదకరం.అని తేల్చారు. మూల వేరియంట్ లేదా ప్రాధాన వేరియంట్ కన్నా అత్యంత ప్రమాదకరమైన లక్షణాలు ఆస్పత్రులలో చేరడం మరణించడం వంటివి జరగవని.అయితే ప్రాధాన వేరియంట్ లో లాగా ఆర్ టి పి సి ఆర్ పరీక్షలలో స్టేల్ వేరియంట్ ను గుర్తించడం గుర్తించడం,నిర్దారించడం పసిగట్టడం కూడా కష్టం అయితే నిపుణుల అంచనా ప్రకారం స్టేల్ ఒమైక్రాన్ వేరియంట్ మ్యుటేషన్ ఎక్కువగా ఉంటుంది. స్టేల్ వేరియంట్ ను మరింతగా పరిశీలించాల్సి ఉందని.నిపుణులు అభిప్రాయ పడ్డారు.అయితే వేరియంట్ ఏదైనా దాని తీవ్రత ఎలా ఉన్నా ఉప్పెనలా ముంచె కోవిడ్ ఉపద్రవం ముప్పు పూర్తిగా తొలగి పోలేదని అనూక్షణం అప్రమత్తం గా ఉండడం నియమ నిబందనలు పాటించాల్సిన అవసరం ఉందని అప్పుడే మనం కోరోనాను ఎదుర్కుంటూనే వాటిపై పోరాడగలం అన్నది మాత్రం నిజం.