పవన్ రికార్డ్స్ ను ఆమె బ్రేక్ చేస్తుందా...?

 

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసి, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అదే విధంగా కోలీవుడ్ లో నయనతార నటించిన "రాజా రాణి" చిత్రం కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారని అనుకుంటే, రీమేక్ కాకుండా కేవలం డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో "రాజు రాణి" పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నయనతార, ఆర్య జంటగా నటించారు. మురుగదాస్ నిర్మించిన ఈ చిత్రానికి అట్లీకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగులో విడుదల చేయనున్నారు. మరి తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.