మంత్రి గంటా అలక.. అవును నిజమే: నారా లోకేష్

 

మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని.. ఆయన నేడో, రేపో వైసీపీలో చేరతారని వార్తలొచ్చాయి. గంటా అలకబూనారంటూ జగన్ సంబంధించిన మీడియా సాక్షిలో ప్రసారం అయింది. ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో.. గంటాతో ఆ విషయంపై చర్చించిన లోకేష్.. ఆయనతో ఫొటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేసి సాక్షికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘అవును నిజమే.. గంటా శ్రీనివాసరావు గారి ముఖంలో అలక చూడండి.’ అంటూ ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేశారు. ‘అవినీతి డబ్బా ... అవినీతి పత్రిక’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాకుండా.. ఫేక్‌న్యూస్ సాక్షి, ఫేక్ టీవీ, ఫేక్ లీడర్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను జత చేశారు.