నారా లోకేష్‌కి కంఠంనేని రవిశంకర్ బర్త్‌డే విషెస్
posted on Jan 23, 2015 5:58PM

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైభవంగా జరిగాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ ఈ వేడుకలలో పాల్గొని నారా లోకేష్‌కి బర్త్ డే విషెస్ తెలిపారు. తండ్రి నుంచి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న నారా లోకేష్‌కి ఆయన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కంఠంనేని రవిశంకర్‌ని ఆప్యాయంగా పలకరించారు. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా నిబద్ధత గల కార్యకర్తగా సేవ చేస్తున్న కంఠంనేని రవిశంకర్ అంటే నారా లోకేష్‌కి ప్రత్యేకమైన అభిమానం వుంది. ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు తెలుగుదేశం నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.