గాలి జనార్దనరెడ్డి విడుదల

 

మూడున్నర సంవత్సరాలుగా జైల్లో మగ్గిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి జైల్లోంచి విడుదలయ్యారు. ఆయనపై వున్న అన్ని కేసుల్లోనూ సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో కర్నాటకలోని పరప్పన అగ్రహార జైలు నుంచి శుక్రవారం ఆయన విడుదలయ్యారు. శుక్రవారం నాడు ఉదయమే ఆయన జైల్లోంచి విడుదలవుతారని భావించారు. అయితే సుప్రీం కోర్టు నుంచి జైల్లోంచి విడుదల చేసే పత్రాలు రావడం ఆలస్యం కావడంతో ఆయనను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. గాలి జనార్దనరెడ్డి విడుదల అవుతున్నారన్న వార్త ఆయన అనుచర గణంలో ఆనందాన్ని కలిగించింది. వందల సంఖ్యలో పరప్పన అగ్రహార జైలు దగ్గరకి చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu