చంద్రబాబు కంటే లోకేశ్ కే ఎక్కువ రెస్పాన్స్

బుధవారం జరిగిన 34వ తెదేపా మహానాడులో నారా లోకేశ్ కు మాత్రం మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా ప్రజలలోకి వెళ్లడం, రాష్ట్ర రాజధాని అభివృద్ధి విషయంలో అమెరికా పర్యటన చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన విషయంలో నారా లోకేశ్ పాత్ర చాలానే ఉంది. దీంతో ప్రజలలో ఆయనపై నమ్మకం పెరిగింది. దీనికి గాను నిన్న జరిగిన మహానాడులో కూడా ఎంతో మంది సీనియర్ తెదేపా నాయకులు ఉన్నా, ఆఖరికి చంద్రబాబు కంటే కూడా నారా లోకేశ్ కే ఎక్కువ స్పందన లభించింది. దీంతో లోకేశ్‌ కృషికి ప్రశంసలు లభించడం పార్టీలో ఆయన పాత్ర పెరగబోతోందన్న దానికి సూచికని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే చంద్రబాబు ఈ మహానాడులో లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నప్పటికీ.. మహానాడులో ఆయన కలిసేవారు.. ఆయనను కలిసేవారిని చూస్తుంటే మాత్రం రాజోయే రోజుల్లో లోకేశ్ పార్టీకి కీలకమని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu