షాక్...ముంబై ఎయిర్‌పోర్టులో రూ.36 కోట్ల డ్రగ్స్

దేశంలో డ్రగ్స్ వినియోగాన్ని పోలీసులు, నిఘా సంస్థలు ఎంతగా అడ్డుకుంటున్నా..కేటుగాళ్లు భద్రతా సంస్థల కళ్లుగప్పి విచ్చలవిడిగా చలామణి చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఏకంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రూ.36 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కొలంబియా నుంచి ముంబై వచ్చిన ఓ వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద మాదకద్రవ్యాలు దొరికాయి. అతణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు. ఇంత విలువైన మాదక ద్రవ్యాలు ముంబై విమానాశ్రయానికి రావడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu