కాపుల కోసం రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
posted on Jun 12, 2016 5:13PM

ఆర్ధికంగా వెనుకబడిన కాపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టిందని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ రామానుజయ్య తెలిపారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాపు యువకుల కోసం "విద్యోన్నతి" పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడి, సివిల్స్ వంటి ఉన్నతోదోగ్యాల కోసం సన్నద్ధమవుతున్న యువకులు లబ్దిపొందుతారని ఆయన చెప్పారు. ఈ పథకం కింద ప్రతి ఏటా 500 మందికి ఉచిత శిక్షణ కల్పించనున్నామని రామానుజయ్య తెలిపారు. అలాగే "విదేశీ విద్యా దీవెన" పేరిట మరో పథకాన్ని కూడా కాపు యువత కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు. దీని ద్వారా విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లే 500 మంది విద్యార్థులకు సాయం అందజేయనున్నామన్నారు. అయితే ఈ రెండు పథకాలలో లబ్థిపోందాలంటే కాపు కార్పోరేషన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి ఉండాలని ఆయన సూచించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.