బోల్ట్ ఖాతాలో మరో రికార్డు..

జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఖాతాలో మరో రికార్డు చేరింది. కింగ్‌స్టన్‌లో నిర్వహించిన రేసర్స్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మీటింగ్‌లో జరిగిన 100 మీ..రేసును 9.88 సెకండ్లలోనే పూర్తి చేశాడు. దీంతో ఈ ఏడాది అత్యంత తక్కువ సమయంలో 100 మీ. పరిగెత్తిన రెండో క్రీడాకారుడిగా బోల్ట్ రికార్డు సృష్టించాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఒకే దేశానికి చెందిన బోల్ట్, పావెల్, బ్లేక్ ఒకేసారి పోటీపడటం దేశ ప్రజల్లో ఉత్కంఠను కలిగించింది. అందుకే ఈ పందెంను వీక్షేంచేందుకు రికార్డు స్థాయిలో 30,000 మంది అభిమానులు స్టేడియంకు వచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu