ఇంట్లో ఈ మొక్కలు పెంచితే  డబ్బుకు లోటు ఉండదట..!

డబ్బు మనిషికి తప్పనిసరి అయిపోయింది. మానవ కార్యకలాపాలలో డబ్బుదే కీలకపాత్ర. డబ్బు లేకుంటే మనిషికి గౌరవం లేకపోవడం మాట అటుంచిదే.. జీవనం దుర్బరంగా మారుతుంది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మంచి జీవితం, కన్న కలలు, సమాజంలో ఆర్ధిక హోదా వంటివన్నీ డబ్బుంటేనే నెరవేరుతాయి. అందుకే ప్రతి వ్యక్తి తమకు లోటు లేకుండా డబ్బు ఉండాలని అనుకుంటాడు. అందుకోసం కష్టపడి సంపాదించడమే కాకుండా ఇంట్లో ధనం నిలవడానికి చాలా పరిహారాలు, ప్రయత్నాలు, పూజలు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని  మొక్కలు ఇంట్లో పెంచితే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదని అంటున్నారు. ఇంతకీ అవేం మొక్కలంటే..


వెదురు మొక్క..

వెదురు మొక్కను ఇంట్లో ఉంచితే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందట. ఈ మొక్క ఇంట్లో వారి జీవితాలలో ఆనందాన్ని,  కుటుంబ సభ్యుల శ్రేయస్సును పెంచుతుందట.  అందుకే వెదురు మొక్కను పెంచుకోవడం మంచిదంటున్నారు.


మనీ ప్లాంట్..


మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లలో ఉండే మొక్క. ఈ మొక్క ఇంట్లో ఉంటే పేరుకు తగ్గట్టే ఆర్థికంగా బాగుంటుందని,  ఆ ఇంట్లో ధనం అభివృద్ది చెందుతూ ఉంటుందని అంటారు. అయితే మనీ ప్లాంట్ లో పసుపు రంగు ఆకులు ఉండకుండా చూసుకోవాలి ముదురు ఆకుపచ్చ ఆకులు మాత్రమే ఉండాలి.  

పీస్ లిల్లీ..


పీస్ లిల్లీ మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.  ఈ మొక్క ఇంటి పరిసరాలలోనూ, ఇంట్లోనూ గాలిని శుద్ది చేస్తుంది.  ఇంటి వాతావరణం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇంటిలో పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది.  ఇంటి ఆర్థిక అభివృద్దికి దోహదం చేస్తుంది.


ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్..


ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ మొక్క ఆకులు పెద్దగా ఏనుగు చెవుల ఆకారంలో ఉంటాయి.  ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి కూడా ఈ మొక్క సహాయపడుతుందట.


స్నేక్ ప్లాంట్..


స్నేక్ ప్లాంట్ మొక్క గాలిని శుభ్రపరుస్తుంది.  ఈ మొక్క  ఒకవైపు ఆరోగ్యాన్ని, మరొకవైపు ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ ను కూడా ఇస్తుంది. శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు స్నేక్ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకుంటే మంచిది.

చైనీస్ మనీ ప్లాంట్..


మనీ ప్లాంట్ భారతీయుల దగ్గర ఒక విధంగానూ, చైనా ప్రజల దగ్గర ఒక విధంగానూ ఉంటుంది.  చైనీస్ మనీ ప్లాంట్ కు ఆకులు గుండ్రంగా ముదురు ఆకువచ్చ రంగులో ఉంటాయి.  ఇవి ధన ఆకర్షణ కలిగి ఉంటాయని అంటారు. అదే విధంగా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయట. తద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.


సిట్రస్ మొక్కలు..

నమ్మరు కానీ సిట్రస్ మొక్కలను ఇంట్లో పెంచుతుంటే అదృష్టం కలిసొస్తుందట. సిట్రస్ పండ్లు ఎలాగో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.  ఇక ఇవి పెరుగుతున్న ఇంట్లో ఆర్థికంగా మంచి అభివృద్ది ఉంటుందట.  సిట్రస్ మొక్కల నుండి వచ్చే సువాసన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.


                                              *రూపశ్రీ.


 

Related Segment News