పెట్టుబడుల స్వర్గం ఇండియా

 

భారతదేశం కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదని, ఒక శక్తి అని, పెట్టుబడుల స్వర్గమని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రస్తుతం ఆయన యుఎఇ పర్యటనలో వున్నారు. ఆయన సోమవారం అబుదాబిలోని మస్దర్ నగరంలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత - యుఎఇ మధ్య చాలా విమాన సర్వీసులు వున్నా, భారత ప్రధాని ఇక్కడకు రావడానికి 34 సంవత్సరాలు పట్టింది. భారతదేశంలో అభివృద్ధికి అపార అవకాశాలు వున్నాయి. వాటిని ప్రపంచ పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, మూడీస్ అంగీకరించాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో ఒక ట్రిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని, మౌలిక వసతుల అభివృద్ధి, స్థిరాస్తి రంగాల్లో అపార అవకాశాలు వున్నాయని మోడీ వివరించారు.