క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు..

 

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ఎంట్రీ మరోసారి తెరపైకి వచ్చింది. రోజా కనుక అసెంబ్లీకి వస్తే టీడీపీ ఎమ్మెల్యే అయిన అనితకు క్షమాపణ చెప్పాల్సిందే అని... క్షమాపణ చెప్పిన తరువాతే అసెంబ్లీలోకి రావాలని మంత్రి యనమల డిమాండ్ చేశారు. అయితే దీనికి గాను స్పందించిన రోజా.. అసెంబ్లీలో తాను క్షమాపణ కోరే సమస్యే లేదని.. తాను ఏ తప్పూ చేయలేదని, ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిజమైన వీడియో క్లిప్పింగ్స్ బయట పెట్టాలని.. అప్పుడే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. అప్పుడు కూడా తాను తప్పు చేశానని తేలితే, రెండేళ్లు కాదు, మూడేళ్ల సస్సెన్షన్ కు కూడా తాను సిద్ధమేనని ఆమె అన్నారు. అంతేకాదు వీడియో క్లిప్పింగ్స్ దొంగిలించిన కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని కోరారు.