అమెరికాపై ట్రంప్ ఎఫెక్ట్... పడిపోయిన ర్యాంకు..

 

అమెరికాపై డొనాల్డ్ ట్రంప్ ప్రభావం బాగానే పడినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా పలు నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు ట్రంప్ ప్రభావం వల్ల ఇప్పుడు ఏకంగా అమెరికా తన ర్యాంకును కోల్పోయింది. ప్రపంచంలోని అత్యత్తమ దేశాల జాబితాపై యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్ట‌న్ స్కూల్ అండ్ గ్లోబ‌ల్ గ్రాండ్ క‌న్స‌ల్టెంట్స్‌కు చెందిన‌ యూఎస్ న్యూస్ అండ్ వ‌ర‌ల్డ్ చేసిన సర్వేలో స్విట్జ‌ర్లాండ్ అగ్ర‌స్థానంలో నిలవగా..  రెండు, మూడో స్థానాల్లో కెన‌డా, బ్రిట‌న్ దేశాలు స్థానం దక్కించుకున్నాయి. ఇక ఈ సర్వేలో గత ఏడాది నాలుగో స్థానంలో ఉన్న అమెరికా.. ఇప్పుడు మరో మూడు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి చేరింది. అయితే దీనికి కారణం ట్రంప్ ఎఫెక్టే అని స్ఫష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే..  అమెరికాలో నాయ‌క‌త్వం మార‌డంతో ఆ దేశంపై గౌర‌వం త‌గ్గిపోయింద‌ని ఈ స‌ర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది అభిప్రాయ‌ప‌డమే కారణం. మొత్తానికి ట్రంప్ ప్రభావం అమెరికాపై బాగానే పడింది.