మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

 

మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి.  మే 4 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ ముగింపు వేడుకలను భాగ్యనగరంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కాంపిటీషన్స్‌కు వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదని సీఎం అన్నారు. విభాగాలవారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పోటీలు నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu