పదవి పోతుందన్న భయంతో.. యాగం.. 50 మేకపోతులు బలి..
posted on May 15, 2017 11:30AM

తన పదవి ఎక్కడ పోతుందో అన్న భయంతో ఏకంగా పూజలే నిర్వహించాడు ఓ మంత్రి. అంతేకాదు పూజ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 మేకపోతుల్ని బలిచ్చాడు. ఇంతకీ ఆ మంత్రి వర్యలు ఎవరనుకుంటున్నారా..? వివరాల ప్రకారం... నాగపట్నం జిల్లా వేదారణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మణియన్ ను దివంగత జయలలిత మంత్రిని చేశారు. అమ్మ మరణించిన తరువాత మణియన్ చిన్నమ్మకు విధేయుడిగానే ఉన్నాడు. అయితే ఆ తరువాత చిన్నమ్మ జైలుకు వెళ్లడం.. ముఖ్యమంత్రిగా పళని స్వామిని నియమించడం జరిగిపోయాయి. అయితే పళనిస్వామి తో మాత్రం మణియన్ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో తనను పదవి నుండి తప్పిస్తారేమో అన్న భయంతో వేదారణ్యంలోని ప్రఖ్యాత వేదారణేశ్వరర్ ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. యాగం ముగిసిన వెంటనే ఆయన నేరుగా మునీశ్వర ఆలయానికి వెళ్లి అక్కడ 50 మేకపోతులను బలి ఇచ్చారు. అయితే, ఈ యాగంకు మంత్రి, అన్నాడీఎంకే వర్గాలు తప్ప, బయటకు వ్యక్తులు ఎవ్వరు లేరు. మరోవైపు మంత్రి గారు ఈ యాగం ఆ నోటా ఈనోటా అందరికీ తెలియడంతో పెద్ద చర్చ మొదలైంది.