మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
posted on Aug 6, 2025 2:52PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల నరనరాల్లో కుల పిచ్చి పాతుకుపోయిందని మంత్రి ఆరోపించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది మూర్ము వితంతు మహిళ అని ప్రధాని మోదీ పిలవలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె గిరిజన మహిళ అని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని కొండా సురేఖ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రపతి వంటి గౌరవ పదవిపై జరిగిన వ్యాఖ్యలపై సమాజంలో అన్ని వర్గాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.