అది రాకెట్ లాంఛర్ కాదు.. తప్పులో కాలేసిన పోలీసులు..

 

మథుర అల్లర్ల నేపథ్యంలో జవహర్ బాగ్ పార్కులో పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్కడ ఓ రాకెట్ లాంఛర్ దొరికిన సంగతి తెలిసిందే. అయితే అది అమెరికాకు చెందినది అని.. అది అక్కడికి ఎలా వచ్చిందని పలు కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా తెలిసిన విషయాల ప్రకారం పోలీసులు తప్పులో కాలేసినట్టు తెలుస్తోంది. అయితే అది రాకెట్ లాంఛర్ కాదని, భాష్పవాయువు ప్రయోగించే గన్ అని వారు తెలిపారు. దీనిని అమెరికాకు చెందిన జెఫర్ సన్ కంపెనీ తయారు చేసిందని మధుర ఎస్పీ వెల్లడించారు.