మార్కాపురం ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్

ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి .ఈయన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, మార్కాపురం నియోజకవర్గంలోని సమస్యలపై   ఈ నెల 22న ప్రజా దర్బార్ నిర్వహించారు.  ఆ ప్రజా దర్బార్‌ నిర్వహించిన నారాయణరెడ్డి ప్రజల ముందు సెలైన్ పెట్టించుకుని ఓవర్ యాక్షన్ చేయడం నవ్వులపాలవుతోంది.  మహిళా దినోత్సవం పురస్కరించుకుని  సిఎం చంద్రబాబు ఇటీవల మార్కాపురం వచ్చారు.  తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తల మీటింగ్ లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలు అంటించారు. తీరు మార్చుకోకపోతే పోతే చర్యలు ఉంటాయని తీవ్రంగానే హెచ్చరించారు. 

సిఎం చంద్రబాబు ఎమ్మెల్యే కందులపై అలా కార్యకర్తల ముందు మండిపడటంతో  ఆయన  పరువు పొయినట్లైంది. సొంత క్యాడర్ ముందు డ్యామేజ్ అయ్యానని ఆయన తెగ ఫీల్ అవుతున్నారంట. ఆ క్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రజలలో సానుభూతి పొందటానికి  ఓవర్ యాక్షన్ చేస్తున్నారని  నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రజా దర్భర్ లో సెలైన్ పెట్టించుకోవడం అందులో భాగమే అంటున్నారు.