నిప్పులు చెరిగిన విష్ణువర్థన్ బాబు

 manchu vishnu, Denikaina Ready manchu vishnu, Denikaina Ready issue, Denikaina ready controversy

 

దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా కొన్ని సీన్లున్నాయన్న కోణంలో తలెత్తిన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. తమని అవమానిస్తే ఎంతకైనా తెగిస్తామంటూ కొందరు మోహన్ బాబు ఇంటిమీద దాడికి దిగడం హైదరాబాద్ లో కలకలం రేపింది. ఇంటిమీదకొచ్చి దాడి చేయడమేంటంటూ మంచు విష్ణువర్ధన్ బాబు తారా స్థాయిలో మండిపడ్డాడు. " నేనింట్లో లేను కాబట్టి సరిపోయింది. లేకుంటే మీ సంగతి తేల్చేవాడిని, ఏమనుకుంటున్నారు మీరు, సిటీలో తిరగాలని లేదా.. సినిమావాళ్ల ఇళ్లమీదకి రావడం ఫ్యాషనైపోయింది" అంటూ విష్ణువర్థన్ సవాల్ విసరడం మరో వివాదానికి తెరలేపింది.


"గమ్మునుంటే చాతగానివాళ్లలా కనిపిస్తున్నామా? ఇంటికొచ్చి డోర్లు పగలగొట్టడం, లైట్లు పగలగొట్టడం హీరోయిజం అనుకుంటున్నారా..? బుధవారం సినిమా రిలీజైతే సోమవారం పనిగట్టుకుని ఇంటిమీదికి దాడికి రావడమేంటి. ఎవరో పనిగట్టుకుని వాళ్లని రెచ్చగొడుతున్నారు. సినిమాని సినిమాలాగా చూడాలి. కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో విడుదలైన సినిమాల మీద ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయడంలేదే.. మరిక్కడమాత్రం ఇలాంటివన్నీ ఎందుకొస్తున్నాయ్.." అంటూ విష్ణువర్ధన్ మండిపడ్డాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu