చందమామ ల్యాండ్ మార్క్ అవుతుందట...!

 

ఎనిమిది వేరు వేరు కథలను కలిపి ఒకే సినిమాలో చూపిస్తూ.. కొత్త రీతిలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "చందమామ కథలు". ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చాణక్య బూనేటి నిర్మించాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ.... "చందమామ కథలు లాంటి ఓ మంచి సినిమాలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. తెలుగు సినిమా చరిత్రలో ఈ మూవీ ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు" అని అన్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu