బంగారు కోడిపెట్ట ఆగిపాయే....!

 

నవదీప్, స్వాతి జంటగా నటించిన "బంగారు కోడిపెట్ట" చిత్ర విడుదల గతకొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఎలాగైనా ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేసారు. కానీ అదే సమయంలో "బసంతి", "భీమవరం బుల్లోడు" వంటి సినిమాలు విడుదల అవుతుండటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసారు. మార్చి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నవదీప్ తెలిపారు. రాజ్ పిప్పళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సునీత తాటి నిర్మించారు. మహేష్ శంకర్ సంగీతం అందించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu