మానవత్వం చూపించాడు- ఉద్యోగం కొట్టేశాడు

మంచివాళ్లకి అంతా మంచే జరుగుతుందని చెబుతుంటారు పెద్దలు. మంచి వ్యక్తిత్వం ఉంటే నిజంగానే ఎక్కడో అక్కడ అవకాశం తలుపుతట్టక మానదు. దానికి గస్సమా అనే ఆఫ్రికా యువకుడి వార్తే ఒక ఉదంతం. మాలికి చెందిన గస్సమా ఉద్యోగం కోసమని పొట్ట చేత పట్టుకుని పారిస్‌కు వెళ్లాడు. అక్కడ వీధుల్లో తిరుగుతుండగా అతనికో పాప బిల్డింగ్ మీద నుంచి వేళ్లాడుతూ కనిపించింది. అంతే! ముందూ వెనుకా ఆలోచించలేదు... చటుక్కున బిల్డింగ్‌ ఎక్కేశాడు... పాపను కాపాడేశాడు. గస్సమా గురించి విన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు, అతనికి ఫ్రాన్స్‌ పౌరసత్వంతో పాటు ఉద్యోగాన్ని కూడా మంజూరుచేసేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu