స్పీకర్ కు చుక్కెదురు...కోర్టుకు రావాల్సిందే....


ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. 2014 ఎన్నికల్లో తాను రూ. 11.50 కోట్లు ఖర్చు చేశానని కోడెల శివప్రసాద్ ఓ ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే కదా. దీంతో కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించినందుకు కోడెలపై అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2017 మార్చి 7న కోడెలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో, హైకోర్టును ఆశ్రయించిన కోడెల వ్యక్తిగతంగా తాను కోర్టుకు హాజరుకాలేనని స్టే తెచ్చుకున్నారు. ఈ స్టే ఆర్డర్ ను సవాల్ చేస్తూ, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భాస్కర్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్ 18న కోడెల స్వయంగా కరీంనగర్ కోర్టుకు హాజరుకావాలని జడ్జి రాజు ఆదేశించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu