ఒబామా కూతురికి కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు మాలియా ఒబామా ఓ యువ లాయర్ మనసును దోచేసింది. కెన్యాకు చెందిన ఫెలిక్స్ కిప్రోనోది అనే యువ లాయర్ 2008 నుండి మాలియా ఒబామాను ప్రేమిస్తున్నానని, ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులతో కూడా చర్చించానని చెప్పాడు. అంతే కాదండోయ్ ఆమెకు కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలు, 30 మేకలు కూడా ఇస్తానని చెప్తున్నాడు ఈ వన్‌సైడ్ లవర్. తనది నిజమైన ప్రేమని, డబ్బు మీద ఆశతో మాలియాను లవ్ చేయడం లేదని, మాలియాను పెళ్లి చేసుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. మాలియాతో పెళ్లి విషయాన్ని జులైలో కెన్యా పర్యటనకు రానున్న ఒబామాతో మాట్లాడతానని, పర్యటనకు మాలియాను కూడా తీసుకురావల్సిందిగా లేఖ రాస్తానని తెలిపాడు. ఒకవేళ మాలియా వస్తే తనకు పాలు పితకడం, కెన్యా వంటకం ఎలా చేయాలో నేర్పిస్తానని అప్పుడే కలల లోకంలో విహరిస్తున్నాడు కిప్రోనో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu