కరోనా తగ్గించే కషాయాలు...

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం కొన్ని రకాల కషాయాలను ఇంట్లో చేసుకుని రోజూ రెండు పూటలు తాగడం ఆరోగ్యకరం.

తులసి ఆకులు, దాల్చిన చెక్క, శొంఠి, నల్ల మిరియాలను నీళ్లలో వేసి బాగా మరగబెట్టి బెల్లం లేదా తేనెతో.. హెర్బల్‌ టీ మాదిరిగా తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
ధనియాలు, మిరియాలు, దాల్చినచెక్క, శొంఠి సమపాళ్ళలో తీసుకుని పొడి చేయాలి. ఒక స్పూన్ పొడిని గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి.

తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, యాలకులు, శొంఠి, ఎండుద్రాక్ష, బెల్లం, నిమ్మరసం తీసుకోవాలి. వీటిలో దాల్చిన చెక్క, నల్లమిరియాలు, యాలకులు, శొంఠి పొడి చేసుకోవాలి. ఒక లీటర్ నీటిని వేడి చేస్తూ అందులో ఎండు ద్రాక్ష, ముందుగా చేసుకున్న పొడి, తులసి ఆకులు వేయాలి. పది నిమిషాల పాటు మరిగిన తర్వాత చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం, బెల్లం కలిపి తాగాలి. ఒక లీటర్ నీటితో చేసుకునే ఈ కషాయం ఇంట్లో నలుగురికి సరిపోతుంది.

అల్లం, పసుపు, మిరియాలు, బెల్లం. రెండు గ్లాసుల వేడి నీటిలో స్పూన్ అల్లం రసం, అర స్పూన్ పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి వేయాలి. ఐదు నిమిషాలు మరిగిన తర్వాత బెల్లం వేయాలి. వేడివేడిగా ఈ కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.