‘మా’ కార్యదర్శిగా శివాజీరాజా

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యదర్శిగా శివాజీరాజా విజయం సాధించారు. శుక్రవారం నాడు జరిగిన ఓట్ల లెక్కింపు జరిగింది. ‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నికైన విషయం తెలిసిందే. శివాజీ రాజా రాజేంద్రప్రసాద్ ప్యానల్లోనే వున్నారు. 36 ఓట్ల ఆధిక్యంతో అలీపై శివాజీరాజా గెలిచారు. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ తరపున పోటీచేసిన శివాజీరాజా, కాదంబరి కిరణ్‌, ఏడాది శ్రీరాం గెలుపొందారు. ఈసీ మెంబర్లుగా కాదంబరి కిరణ్‌, ఏడిది శ్రీరాం విజయం సాధించగా, కోశాధికారిగా పరుచూరి వెంకట్శేరరావు విజయం సాధించారు.