కృష్ణ కాంత్ పార్కులో ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత జరిగింది ఇది.. 

నేటి యువతకి బాధ్యత లేకుండా పోయింది. ఏవేవో అనుకుని అడ్డదారి తొక్కుతున్నారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులో కొందరు యువకులు పెడతోవ పడుతున్నారు. ప్రేమ పేరుతో జీవితాలను చిక్కుల్లోకి నెట్టుకుంటున్నారు. అమ్మాయిల వెంట పడుతూ ఆకతాయిల్లా మారుతున్నారు. గల్లీలో, బస్తీల్లో పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతూ చిల్లరగాళ్లనే ముద్ర వేసుకుంటున్నారు. పొద్దున్న లేస్తే ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట బొంగరంల తిరుగుతూ. అమ్మాయిలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా  ఓ అమ్మాయిని లవ్ పేరుతో ముప్పుతిప్పలు పెట్టి.. చివరకు ఆమె సరే అనడంతో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లడం హీరోయిజంగా భావించిన ఓ యువకుడు చివరకు పోలీస్ స్టేషన్‌లో చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చింది.

అది హైదరాబాద్. యూసఫ్‌గూడ ప్రాంతానికి చెందిన రమేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. సినిమాల్లో ప్రేమ పేరుతో ఓ యువతి తిరిగాడు. ఆ తర్వాత ఆమెతో ‘ఐ లవ్ యూ’ చెప్పించుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. అతనికి ఏ పనీపాటా లేకపోవడం, ఇంట్లో వాళ్లు కూడా పట్టించుకోకపోవడంతో ఆ బాలిక ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడమే పనిగా పెట్టుకున్నాడు. సినిమాలో హీరోలా ఆమె ముందు ఫోజులు కొట్టాడు. ఆమెను తన పిచ్చి ప్రేమలో దింపాలని ఫిక్సయిపోయాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. రమేష్ పిచ్చి మాటలకు, వెకిలి చేష్టలకు, పొగడ్తలకు ఆ అమ్మాయి  ఇంప్రెస్ అయింది. ఆమె కూడా ‘నువ్వంటే నాకిష్టం’  నువ్వు లేక నేనులేను అని చెపింది అని చెప్పింది. ఇంకేముంది.. కట్ చేస్తే రమేష్‌తో కలిసి ఆ బాలిక చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించింది. ఇద్దరూ కలిసి సినిమాలకు, షికార్లకు తిరిగారు. యూసఫ్‌గూడకు దగ్గర్లో ఉన్న కృష్ణకాంత్ పార్కుకు పలుమార్లు వెళ్లి సరదగా గడిపేవారు. మే 5న బాలికను కృష్ణకాంత్ పార్క్‌కు తీసుకెళ్లిన రమేష్ ఆమె ఊహించని పని చేశాడు. పార్క్‌కు తీసుకెళ్లి ఎవరూ చూడకుండా ఆమె వద్దంటున్నా వినకుండా బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టాడు. అనంతరం.. పెళ్లయిందని.. ఇక ఏం చేసినా తప్పు లేదని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

అంతేకాదు.. అదే రోజు ఆమెను రమేష్ పార్క్‌కు దగ్గర్లో ఉన్న మేనత్త ఇంటికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టినట్టు చెప్పాడు. దీంతో.. రమేష్ మేనత్త అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి వచ్చిన రమేష్ తల్లి యేసమ్మ ‘ఇదేం పనిరా’ అని కొడుకుకు చీవాట్లు పెట్టింది. ఆ బాలికను కూడా తిట్టికొట్టి అక్కడ నుంచి పంపించేశారు. మళ్లీ రమేష్‌ను కలిసేందుకు ఈవైపుకు వస్తే మర్యాదగా ఉండదని బాలికను హెచ్చరించారు. ఏడుస్తూ ఆ బాలిక అక్కడ నుంచి వెళ్లిపోయింది. జరిగింది ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని భావించిన బాలిక తన మెడలో తాళిని కనిపించకుండా కవర్ చేసి.. ఏం తెలియనట్టుగా ఇంట్లో వాళ్ల ముందు ప్రవర్తించింది. అయితే.. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తనలో తాను కుమిలిపోయింది.


మే 17న ఇంట్లో ఒంటరిగా ఉండి ఏడుస్తున్న ఆ బాలికను తల్లి గమనించింది. ఏం జరిగిందని, ఎందుకు ఏడుస్తున్నావని తల్లి ప్రశ్నించగా జరిగిందంతా చెప్పి ఆ బాలిక కన్నీటిపర్యంతమైంది. దీంతో.. బాలిక తల్లి రమేష్ ఇంటికి వెళ్లి నిలదీయగా ఆమెపై దాడి చేశారు. బాలిక తల్లి రమేష్, అతని కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని, తన కూతురి జీవితాన్ని రమేష్ నాశనం చేశాడని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రమేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.