అవినీతితో కేంద్రం భ్రష్టు పట్టింది: అద్వానీ

న్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత అద్వానీ గత 40 రోజులుగా చేపట్టిన జన చేతన యాత్ర ఈరోజు ఢిల్లీలో ముగిసింది.ఈ సందర్భంగా రాంలీలా మైదానంలోఏర్పాటు చేసిన  బహిరంగ సభలో మాట్లాడుతూ  అవినీతి అంతమయ్యే వరకు తన పోరాటం కొనసాగుతుందని  తెలిపారు.  ఈ సభలో అవినీతితో కేంద్ర ప్రభుత్వం భ్రష్టు పట్టిందని  కేంద్రంపై నిప్పులు చెరిగారు.  అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నా, సర్కారులో కనీసం చలనం లేదన్నారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం వెలికి తీయాలని, ఆ డబ్బు దాచుకున్న వారి పేర్లు బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన జన చేతన యాత్ర విజయవంతమైందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu