కెటీఆర్ అరెస్ట్ కోరుతూ రేవంత్ గవర్నర్ తో భేటీ
posted on Nov 13, 2024 3:55PM
ఫార్ములా ఈ రేసు కుంభకోణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ అరెస్ట్ తప్పదని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో విచారణకు అనుమతి కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తో భేటీ అయ్యారు. కెటీఆర్ విచారణకు అనుమతివ్వాలని ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ అనుమతి కోరిన సంగతి తెలిసిందే. ఓ వైపు రేవంత్ రెడ్డి కెటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం చేసుకుంటుంటే మరో వైపు కెటీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కల్సి రేవంత్ సీటు ఊడగొట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు. రేవంత్ గవర్నర్ ను కలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని కెటీఆర్ స్పష్టం చేశారు. అరెస్ట్ కు భయపడేది లేదని కెటీఆర్ తేల్చేశారు. అమృత్ టెండర్లు ముఖ్యమంత్రి బావమరిదికి దక్కాయని కేంద్ర మంత్రి ఖట్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో నన్ను ఇరికించి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు. రెండు మూడు నెలలో జైలులో ఉండి బయటకు వచ్చి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తానని కెటీఆర్ అన్నారు.
వికారాబాద్ కలెక్టర్ పై దాడి వెనక ఉన్నవారిని ఉపేక్షించేది లేదని , వారికి చిప్పకూడు తినిపిస్తానని రేవంత్ రెడ్డి పరుష వాఖ్యలు చేయడంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి.