ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో  నలుగురు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు 

ఫోన్ ట్యాపింగ్  వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్  జిల్లాల్లో  ఈ వ్యవహారం నడుస్తుంది. బిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.  నకిరేకల్ మాజీ ఎమ్యెల్యే చిగురుమర్తి లింగయ్యకు నోటీసులు అందాయి. ఈయన గురువారం కోర్టుకు హాజరుకానున్నారు. భువనగిరి,  కోదాడ మాజీ ఎమ్యెల్యేలకు నోటీసులు అందాయి.  పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు రేవంత్ సర్కార్ ఆరోపిస్తుంది.  ఈ కేసు లో ఇప్పటి వరకు పోలీసు అధికారుల ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఈ ఉచ్చులో ఇరుక్కున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎస్ బి ఐ  మాజీ చీఫ్ ప్రభారకర్ కూడా నల్లొండ జిల్లా ఎస్ పిగా పని చేశారు.  ఇదే కేసులో జైల్లో ఉన్న తిరుపతన్న జిల్లాలో వివిధ స్థాయిలో పని చేసిన వారే.  బిఆర్ఎస్ కు చెందిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి , కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ కు నోటీసులు అందాయి.   బిఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు 2023లో జరిగిన మునుగోడు ఉపఎన్నిక వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.