రేపటి ధర్నాపై వెనక్కి తగ్గిన ఎంపి లగడపాటి

దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రేపు టీడీపీ చేపట్టే ధర్నా కార్యక్రమానికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ అవసరం లేదని ఎంపి లగడపాటి రాజగోపాల్ వాదించారు. చంద్రబాబుకు పోటీగా ధర్నా చేయాలని మొదట నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఆయన ధర్నాపై వెనక్కి తగ్గారు. చంద్రబాబును స్వయంగా కలిసి అభివృద్ధిపై చర్చిస్తానని లగడపాటి చెప్పారు. ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తామని చెప్పారు.