జగన్ పార్టీలోకి పెరిగిన వలసలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం నుంచి 500 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. మరోవైపు బోడుప్పల్‌లో మేడ్చల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో250 మంది కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పొన్నాల రఘుపతిరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలోనూ ముదినేపల్లి మండలం ఉటుకూరులో టీడీపీ నుంచి 200 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సీపీ చేరారు.