విశాఖ లడ్డు @ 12.75 లక్షలు

 

మామూలుగా గణేష్ లడ్డు ధరలో హైదరాబాద్‌లోని బాలాపూర్ లడ్డే హైలైట్. దేశంలోనే అత్యధిక ధరకు అమ్ముడవుతూ వుంటుంది. ఈసారి తొమ్మిదిన్నర లక్షలకు అమ్ముడుపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గణేషుడి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. విశాఖలోని మురళీనగర్‌లో వున్న విజయ గణపతి లడ్డూ వేలంలో రూ.12.75 లక్షలు పలికింది. వేలంలో వచ్చిన డబ్బును చిన్నపిల్లల గుండె చికిత్స కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇస్తామని వినాయక మండప నిర్వాహకులు తెలిపారు. వైజాగ్ లడ్డు బాలాపూర్ లడ్డు ధర కంటే రెండు లక్షలకు పైగా అధికంగా రేటు పలికింది.