దేవర విషయంలో సరికొత్తగా బయటకొచ్చిన నిజం..కొరటాల శివ 2  

దర్శకుడు కొరటాల శివ(kortala siva)తన తొలి చిత్రం మిర్చి దగ్గర్నుంచి శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్,వంటి వరుస హిట్లతో  ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ నే  పొందాడు. కాకపోతే  2022 లో చిరంజీవి(chiranjeevi)చరణ్ లతో చేసిన ఆచార్య ప్లాప్ గా నిలవడంతో ఎన్నో విమర్శలని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ విమర్శలన్నిటికీ దేవర తో సమాధానం చెప్పబోతున్నాడనే న్యూస్ ఒకటి  సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది.

రీసెంట్ గా దేవర(deavara)ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా హిస్టరీలోనే  హయ్యస్ట్ వ్యూయర్స్ ని సాధించే  మూవీగా నిలుస్తుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల వారి నుంచి వస్తుంది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానుల్లోను, మూవీ లవర్స్ లోను సరికొత్త ఎనర్జీ వచ్చినట్లయింది. రేపు థియేటర్స్ లో ఎన్టీఆర్(ntr) నట విశ్వరూపం ఒక రేంజ్ లో ఉండబోతుందని బల్లగుద్ది మరి చెప్తున్నారు. ఇదే టైంలో  మరో న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగా ట్రైలర్ లో కథ ఏంటనేది  చెప్పరు. కానీ దేవర ట్రైలర్ చూస్తుంటే కథ ఎలా ఉండబోతుందో ఈజీ గా తెలిసిపోతుంది. దీంతో కొరటాల ఇలా చెయ్యడం కరెక్ట్ నా అనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్లందరికీ తెలియని విషయం ఏంటంటే, కొరటాల గత చిత్రాలని కనుక ఒకసారి పరిశీలిస్తే  కొరటాల సినిమాలన్నీ కూడా సోషల్ కాజ్ తో నే తెరకెక్కుతాయి. అదే విధంగా దేవర లో కూడా బలమైన సోషల్ మెసేజ్ తో కూడిన కథ ఉందని, దాన్ని  కొరటాల కావాలనే దాచాడని రేపు థియేటర్ లో ఆ పాయింట్ ఒక రేంజ్ లో అదిరిపోతుందని అంటున్నారు.   

ఇక ఆల్రెడీ తెలుగు వెర్షన్ కి సంబంధించి సెన్సార్ కూడా పూర్తయ్యి మూవీ ఒక రేంజ్ లో ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ళ తర్వాత వస్తున్న సోలో మూవీ కావడంతో అభిమానుల హంగామా అయితే ఇప్పటినుంచే ఒక రేంజ్ లో ఉంది. ట్రైలర్ రిలీజ్ తో ఆ విషయం స్పష్టంగా అర్దమవ్వగా మొత్తం ఐదు భాషల్లో సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.