మ‌రో బండ్ల గ‌ణేశ్‌!.. కేసినో నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని చస్తా.. కొడాలి నాని కామెడీ!

బండ్ల గణేశ్ ఎపిసోడ్ గుర్తుందిగా! అప్ప‌ట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఒక‌వేళ తాను ఓడిపోతే.. 7' ఓ క్లాక్ బ్లేడ్‌తో మెడ కోసుకొని చ‌స్తా నంటూ స‌వాల్ చేశారు. ఆ త‌ర్వాత అస‌లా ఎన్నిక‌ల్లో బండ్ల గ‌ణేశ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెటే ఇవ్వ‌లేదు. ఆయ‌న పోటీనే చేయ‌లేదు. దీంతో.. కొంద‌రు ఉత్సాహ‌వంతులు 7' ఓ క్లాక్ బ్లేడ్ తీసుకొని ఆయ‌న ఇంటికెళ్లారు. బండ్ల గ‌ణేశ్ ఇంట్లో లేరు. అప్ప‌టి నుంచీ ఆయ‌న్ను బ్లేడ్ బాబ్జీ అంటున్నారు. ఆ త‌ర్వాత అదే విష‌యాన్ని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తే.. ఊరుకోండి.. ఫ్లో లో ఎన్నెన్నో అంటాం.. అవ‌న్నీ చేస్తామా ఏంటి? అంటూ బండ్ల గ‌ణేశ్ కామెడీ చేశారు. సేమ్ టూ సేమ్‌.. అలాంటి సంద‌ర్భ‌మే ఇప్పుడు ఏపీలో తెర‌మీద‌కు వ‌చ్చింది. 

గుడివాడ‌లో గోవా. ఈ లైన్ వింటే ఈపాటికే మీకు మేట‌ర్ అర్థ‌మైపోవాలి. సంక్రాంతికి గుడివాడ‌లో మంత్రి కొడాలి నానికి చెందిన కె క‌న్వెన్ష‌న్‌లో ర‌చ్చ రంబోలా జ‌రిగింది. కేసినోలు, పేకాట‌, గుండాల‌, జూదం, మందు, విందు, చిందు, చీర్ గ‌ర్ల్స్‌.. ఇలా నానా హంగామా చేశారు. సుమారు 500 కోట్ల బిజినెస్ జ‌రిగింద‌ని అన్నారు. ఈ కేసినో విజువ‌ల్స్‌, అందులో ఆటా-పాట‌.. ఆ వీడియోల‌న్నీ మీడియాలో ఫుల్‌గా ప్ర‌సార‌మ‌య్యాయి. సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. మొత్తం త‌తంగ‌మంతా ముగిసాక‌.. కె క‌న్వెన్ష‌న్‌లో కేసినోను ఎత్తేశాక‌.. తీరిగ్గా మీడియా ముందుకు వ‌చ్చారు మంత్రి కొడాలి నాని. తాను స‌చ్చీలుడినంటూ బాగా క‌వ‌రింగ్ ఇచ్చారు. 

తన కల్యాణ మండపంలో కేసినో పెట్టానని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. ఇక్కడే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని.. కొడాలి నాని స‌వాల్ చేశారు. ఎక్కడో జరిగిన దృశ్యాలు తీసుకువచ్చి.. తన కన్వెన్షన్‌లో జరిగినట్టుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. 

కొడాలి నాని మాట‌లు విన్న‌వారంతా తెగ న‌వ్వుతున్నారు. అరెరే.. ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. అప్ప‌ట్లో బండ్ల గ‌ణేశ్‌.. ఆ త‌ర్వాత ఇప్పుడు కొడాలి నాని.. అంటూ ఆ రెండు ఎపిసోడ్ల‌ను క‌లిపి  మీమ్స్ చేస్తున్నారు. బండ్ల గ‌ణేశ్ తాను ఓడిపోతే బ్లేడ్‌తో పీక కోసుకుంటాన‌న్నార‌ని.. ఇప్పుడు కొడాలి నాని సైతం.. కేసినో నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని చ‌చ్చిపోతాన‌ని అంటున్నార‌ని కామెడీ చేస్తున్నారు. 

అంత క్లియ‌ర్‌గా విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. అంత క్లియ‌ర్‌గా వెళ్లిన వాళ్లు సైతం తాము కొడాలి క‌న్వెన్ష‌న్‌లో ఫుల్ ఎంజాయ్ చేశామ‌ని చెబుతున్నారు. ఎంట్రీ ఫీజు 10వేలు క‌ట్టామ‌ని అంటున్నారు. లోప‌ల ఆదో లోకంలా ఉంద‌ని.. స‌ర్వ సుఖాలు ఉన్నాయ‌ని.. గొప్ప‌లు పోతున్నారు. కేసినోలో స‌ర్వం పోగొట్టుకున్న వాళ్లు తెగ తిడుతున్నారు. ఇంత క్లియ‌ర్‌గా మేట‌ర్ ఓపెన్ అయితే.. అంతా అయిపోయాక కొడాలి నాని మీడియా మైకుల ముందు.. అదంతా త‌న క‌న్వెన్ష‌న్‌లో జ‌ర‌గ‌లేద‌ని.. నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని చ‌స్తానంటూ స‌వాల్ చేయ‌డం.. మ‌రో బండ్ల గ‌ణేశ్ య‌వ్వారంలా ఉందంటున్నారు. అయితే, బండ్ల గ‌ణేశ్ ఇంటికి బ్లేడులు తీసుకెళ్లిన ఔత్సాహికులు.. కొడాలి నాని ఇంటికి పెట్రోల్ సీసాల‌తో వెళ్లే సాహ‌సం చేస్తారా? అంత ద‌మ్ముందా..?

Related Segment News