కొడాలి నాని చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోం: టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శిస్తే గుడివాడకు వస్తాం.. వేటాడి మరీ కొం డతాం అంటూ టీడీపీ నేతలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులు కొడాలి నానిని హెచ్చరించారు. గురువారం స్థానిక విశ్వేశ్వరయ్య కూడలిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దిష్టిబొమ్మను దహనం చేశారు.


 

ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొడాలి నాని సస్పెన్షన్‌తో టీడీపీకి శని వదిలిందన్నారు. అన్నం పెట్టిన నందమూ రి వంశానికే కొడాలి ద్రోహం చేశాడని విమర్శించారు. డబ్బులకు ఆశపడి జగన్ పంచన చేరడం నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. సుధాకర్ నాయుడు మా ట్లాడుతూ వెన్నుపోటుదారులను ఎన్నటికీ నమ్మరాదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది చివరికి పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాని పశువు కంటే హీనమన్నారు. టీడీపీ నాయకులు జంపాల మధు మాట్లాడుతూ లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న జగన్‌కు నాని అమ్మడుపోయాడన్నా రు. ఇలా ఎంత మంది ఎమ్మెల్యేలను కొంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కార్యక్రమం లో నగర టీడీపీ అధ్యక్షుడు ఫర్వేజ్, మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు రుస్తుం ఖాన్, నాయకులు ఆకెపోగు ప్రభాకర్, హనుమంత రాయచౌదరి, జేమ్స్ డీవీ చం ద్ర, సంతోషమ్మ తదితరులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu