జీసస్ ఆంధ్రాలో నీ ఆస్తులను కాపాడుకోలేవా?
posted on Jul 13, 2012 5:21PM
రాష్ట్రంలోని పలు చోట్ల కోట్లాది రూపాయల విలువైన సి.ఎస్.ఐ. ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. ఎప్పుడో చర్చిల పేరిట కొనుగోలు చేసిన ఈ ఆస్తుల విలువ బాగా పెరగడంతో కొందరు క్రిస్టియన్ పెద్దలతో కుమ్మక్కయి వీటిని స్వాహా చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ సియస్‌ఐ చర్చికి సంబంధించిన స్థలాలకు ఇదేపరిస్థితి దాపురించింది. మొదట విజయవాడలోని గాంథీ హిల్ సియస్‌ఐ ఆస్తిగానే వుండేది. తర్వాతి రోజుల్లో ఇది కొంత అన్యాక్రాంతం కాగా మరికొంత విక్రయించారు. కాలానుగుణంగా గాంధీహిల్‌గాను, ప్లానెటోరియం సెంటరుగాను మార్చబడిరది. ఇప్పుడు ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. కోర్టు రోడ్డులో ఉన్న చర్చికాంపౌండ్‌లోని స్థలాలను కొందరు అడ్మిన్‌స్ట్రేటివ్ మెంబర్లు నిబంధనలను వ్యతిరేకంగా ఒక గార్డెన్ రెస్టారెంట్‌కి 99 సంవత్సరాలకు లీజుకిచ్చారు. మరికొందరు ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారికి అమ్ముదామనుకున్నప్పుడు దాన్ని అడ్డుకున్న వ్యక్తి కత్తిపోట్లకు గురై హాస్పటల్‌లో మరణించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సమీపంగా ఉన్న సియస్‌ఐ చర్చిది ఇదే కద. చాలా కాలం క్రింద దీన్ని షాపింగ్ కాంప్లెక్సులకు అద్దెకిచ్చారు. ఆ తర్వాత అది ఆక్రమణకు గురైయింది. ఇప్పుడున్న ఆల్ఫాహోటల్ నుండి సియస్‌ఐ సిమెట్రీ ( స్మశానం ) ఇరువైపులా రోడ్డుకానుకున్న షాపింగ్ కాంప్లెక్సులు, హోటల్స్ అన్నీ సియస్‌ఐ ఆస్తులే. చర్చికున్న సమాధిస్థలాలు కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఆల్ఫా హోటల్ ప్రక్కనున్న పెట్రోలు బంకునుండి బస్టాపులవరకు అంతా ఆక్రమణే. ఇప్పుడున్న బిషప్‌లు వీటిని మళ్లీ స్వాదీన పరచుకుంటానికి గానూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మెదక్ చర్చి 1000 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. దీనికి అనుబందంగా చర్చి కాంపౌండ్‌లోనే వృద్దుల శరణాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు ఉన్నాయి. రెవరెంట్ చార్లెస్ వాకర్ పాస్‌నెట్ ఈ చర్చిని 10 ఏళ్లపాటు కట్టించారు. ఆరోజుల్లో కరువు అధికంగా ఉండటం వల్ల కూలీలకు పనికి ఆహారం ఇచ్చేవారు. చర్చి ఎంట్రన్సు ఎత్తును అప్పటి నైజాం నవాబుగారి కోరిక మేరకు చార్మినార్ కంటె కొంచెం తక్కువ చేసారు. ఈ చర్చ్ ఆసియాలోకెల్లా పెద్ద చర్చిగా పేరుగాంచింది.