తనను తానే కిడ్నాప్ చేసుకుని...

 

ఒక అతితెలివి వున్నోడు తనను తాను కిడ్నాప్ చేసుకుని, కిడ్నాప్ డ్రామా ఆడాడు. చివరికి జైల్లో పడ్డాడు. కిడ్నాప్ డ్రామా ఆడి అత్తమామల నుంచి డబ్బు గుంజాలని ప్లాన్ ఇప్పుడు తీరిగ్గా జైల్లో కూర్చున్నాడు ఢిల్లీకి చెందిన అనిస్ అనే వ్యాపారవేత్త. అనిస్ తన కజిన్ షోయబ్‌తో కలసి ఈ కిడ్నాప్ డ్రామా ఆడాడు. అనిస్ కిడ్నాప్ అయ్యాడని, వదిలిపెట్టాలంటే ఐదు లక్షలు ఇవ్వాలని అయుబ్ చేత తన అత్తమామలకి ఫోన్ చేయించాడు. అతని అత్తమామలు డబ్బులు ఇవ్వకుండా, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ మీద నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు అనిస్, షోయబ్‌ని అరెస్టు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu