ఖరగ్‌పూర్ ఐఐటీలో బుజ్జి స్టూడెంట్!

 

అందం, పర్సనాలిటీతో పనిలేదు ఆత్మవిశ్వాసం వుంటే ఏ స్థాయికైనా ఎదగొచ్చు. ఈ సూత్రానికి నిఖార్సయిన నిర్వచనంలా నిలిచే యువకుడు కేరళలోని కొట్టాయానికి చెందిన జాకుబ్ టామీ. కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే వుండే జాకుబ్ టామీ ఒక్క అడుగు అడిగి మూడు అడుగులలో విశ్వాన్నే సొంతం చేసుకున్న వామనావతారాన్ని గుర్తు చేస్తున్నాడు. తాను చాలా పొట్టివాడైనప్పటికీ గుండెనిండా వున్న ఆత్మవిశ్వాసంతో శ్రమించి చదువుకున్నాడు. సీబీఎస్ఈలో ప్లస్ టూ పాసై ప్రతిష్ఠాత్మక ఖరగ్ పూర్ ఐఐటీ ప్రవేశ అర్హత పరీక్షలో 21వ ర్యాంకు సాధించాడు. ఖరగ్‌పూర్ ఐఐటీలో శిక్షణ పొందడానికి సమాయత్తమవుతున్నాడు. తాను పొట్టివాడైనప్పటికీ తన మనసులో దానికి సంబంధించిన న్యూనతాభావం ఏదీ లేదని, తనను తాను అందరితో సమానంగా భావిస్తూ వుంటానని జాకుబ్ టామీ చెబుతున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu