నీ ఇంటికొస్తా... నీ ఆఫీసుకొస్తా... నీ పళ్లు రాలగొడతా... కేశినేనికి పీవీపీ వార్నింగ్

బెజవాడ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఆమధ్య ట్విట్టర్ వేదికగా మాటల తూటలు పేల్చుకున్న కేశినేని నాని-పీవీపీలు... మరోసారి రెచ్చిపోయారు. గతంలో ఆర్ధిక అవకతకలపై ఒకరిపై మరొకరు ట్వీట్ల వర్షం కురిపించుకుంటే... ఈసారి మరో అడుగు ముందుకేసి వ్యక్తిగత దూషణలకు దిగారు. తాజాగా వీరిద్దరి మధ్య... రాజధాని అమరావతి, ఆర్ధిక మాంద్యం చిచ్చుపెట్టాయి. అయితే, మొదట కేశినేని నాని ట్వీట్ తో మొదలైన రగడ... పీవీపీ కౌంటర్ తో పర్సనల్ వార్ కి దారితీసింది. పీవీపీ ఆర్ధిక నేరస్థుడంటూ కేశినేని ఎద్దేవాచేస్తే.... నీ ఇంటికొస్తా, నీ ఆఫీసుకొస్తా, ఎక్కడున్నా వచ్చి నీ పళ్లు రాలగొడతానంటూ పొట్లూరి వరప్రసాద్ ఘాటుగా రియాక్టయ్యారు.

సీఎం జగన్ వైఖరితో ఏపీ రాజధాని అమరావతి ఎన్నో అవకాశాలను కోల్పోతోందంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. ఆర్ధిక మాంద్యం వెన్నాడుతున్నప్పుడు ఉద్దీపన ప్యాకేజీలతో పరిస్థితులను సమతుల్యం చేస్తారని, అయితే, అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే ఆర్ధికంగా అద్భుతాలు జరిగి ఉండేవని, కానీ సీఎం జగన్ వైఖరితో ఆ అవకాశాన్ని కోల్పోయామన్న రీతిలో కేశినేని ఇంగ్లీష్ లో ట్వీట్ చేశారు........ అయితే, అందులో రెసిషన్ స్పెల్లింగ్ ను తప్పుగా రాశారు. అదే పీవీపీకి అస్త్రంగా మారింది. పైగా జగన్ ను రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా కేశినేని ట్వీట్ ఉండటంతో ఘాటుగా స్పందించారు. మిస్టర్ ఎంపీ... రెసిషన్ స్పెల్లింగ్ కూడా రానోడివి--మా ఖర్మ కాకపోతే నీకెందుకయ్యా ఎకానమీ గురించి స్టేట్ మెంట్స్ అంటూ తనదైన స్టైల్లో కౌంటరిచ్చారు...... పీవీపీ ట్వీట్ కు ఏమాత్రం తగ్గకుండా అంతే ఘాటుగా కేశినేని కూడా రివర్స్ కౌంటరిచ్చారు. ఆర్ధిక నేరస్థులు కూడా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగానని భావించడం అంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్చే అంటూ డోసు పెంచారు..... కేశినేని కౌంటర్ తో మరింత రెచ్చిపోయిన పీవీపీ, చదువు సంధ్యాలేని బజారు మనుషులు కూడా మాట్లాడటం మన తెలుగు ప్రజల కర్మ--ఇష్యూ డైవర్ట్ చేయకు--కావాలంటే ఇంగ్లీష్ తెలుగు ట్యూషన్ మాస్టర్స్ ను పంపిస్తా--పిచ్చివాగుడు కట్టిపెట్టి ఒళ్లు ఒంచి పనిచేయరా బడుద్దాయ్--లేదంటే నీ ఇంటికొస్తా, నీ ఆఫీసుకొస్తా, ఎక్కడున్నా వచ్చి నీ పళ్లు రాలగొడతానంటూ పొట్లూరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు

అలా, కేశినేని అండ్ పీవీపీ మాటల తూటాలు పేల్చుకోవడంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, రాజకీయ ప్రత్యర్ధుల మధ్య ఇష్యూ బేస్డ్ గా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే అయినా, అదికాస్త శృతిమించి వ్యక్తిగత దూషణలకు దారితీయడం ఎంతమాత్రం మంచి పరిణామం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి కేశినేని నాని-పొట్లూరి వరప్రసాద్ ట్విట్టర్ వార్ ముందుముందు ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu