కెసిఆర్ క్యాబినెట్ 15 మంది.. 2న ప్రమాణం
posted on May 23, 2014 5:53PM
.jpg)
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం రోజే జూన్ 2వ తేదీన మధ్యాహ్నం 12.57 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజున 15 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ లకీ నెంబర్ ఆరు కనుక మొదటి విడత పదిహేను మంది మంత్రులను తీసుకుంటున్నారని సమాచారం. మిగిలిన ఇద్దరిని ఆ తర్వాత తీసుకుంటారని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఈటెల రాజేందర్‌తో పాటు సిరిసిల్ల స్థానం నుంచి విజయం సాధించిన తన కుమారుడు కెటి రామారావుకు కూడా తొలి విడత మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు.