ముందస్తుకు కారణం కాంగ్రెస్: కేసీఆర్
posted on Sep 7, 2018 6:22PM

అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత శుక్రవారం హుస్నాబాద్‌లో 'ప్రజా ఆశీర్వాద సభ' పేరుతో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు.. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.. ఎన్నికలు ఎందుకు వచ్చాయో నిన్ననే వివరించా.. ఎన్నికలు తేవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్.. అవాకులు, చవాకులు పేలుస్తూ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేవిధంగా కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేసింది.. అవినీతి రహితంగా పాలన చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది.. ప్రతీ రూపాయిని లెక్కపెట్టి సమకూరిస్తే ఆదాయం వచ్చింది.. భారతదేశంలో రైతులకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించకపోతే కాంగ్రెస్‌నేతలు కంటివెలుగు పరీక్షలు చేయించుకోవాలి.. దేశాన్ని కాంగ్రెస్ 60ఏళ్లు పాలించింది.. వాళ్ల అవినీతి, దరిద్రపు పాలన వల్లనే దేశం దౌర్భాగ్యంగా ఉంది అని కేసీఆర్ మండిపడ్డారు.. దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడని దుస్థితి కాంగ్రెస్ వల్లే ఏర్పడింది.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్రాపాలకుల దగ్గర అడుక్కోవడం తప్ప ఎప్పుడూ క్రియాశీలకంగా పనిచేయలేదని మండిపడ్డారు.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తెగేసి చెబితే, ఒక్క కాంగ్రెస్ నేత కూడా పోరాడలేదన్నారు.. అనేక త్యాగాలు చేసి తెలంగాణ సాధించామని అన్నారు.. కాంగ్రెస్ పాలన అంతం కావాలనే 2014లో ప్రజలు తెరాసను గెలిపించారు అని కేసీఆర్ అన్నారు.. మొత్తానికి 'ప్రజా ఆశీర్వాద సభ' సాక్షిగా కేసీఆర్ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.